భద్రాచలం విజయాన్నికేసీఆర్‌కు కానుకగా ఇస్తాం

Tue,September 11, 2018 12:39 AM

దుమ్ముగూడెం : సీపీఎంకు కంచుకోటగా ఉన్న భద్రాచలం నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావును గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని భద్రాచలం టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మా నే రామకృష్ణ అన్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మారుమూల గ్రామాలైన రామచంద్రునిపేట, చెరుపల్లి, కొత్తపల్లి, కొమ్మనాపల్లి, పత్తిపాక, జిన్నెగట్టు, భీమవరం, మారాయిగూడెం, లచ్చిగూడెం, ఆర్లగూడేనికి సోమవారం ప్రచారం నిమిత్తం వెళ్లిన వెంకట్రావుకు పార్టీ మండల నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోటమళ్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా వెంకట్రావ్‌కు ఘనస్వాగతం పలుకుతూ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని, రాను న్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వ్యవసాయ పనులు చేస్తున్న వారి వద్దకు వెళ్లి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. అభివృద్ధిని చూసి ప్రజలందరూ కేసీఆర్ సర్కార్‌వైపే మొగ్గు చూపుతున్నారని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే భద్రాచలం అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావును కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విన్నవించారు. అనంతరం మారాయిగూడెంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపల్లికి చెందిన ఆదివాసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముర్రం వీరభద్రం డాక్టర్ తెల్లం విజయానికి కృషి చేస్తానన్నారు.

టీఆర్‌ఎస్‌లో 100 కుటుంబాలు చేరిక
మండలంలోని మారుమూల గ్రామాల పర్యటనకు వచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు సమక్షంలో సోమవారం వివిధ పార్టీల నుంచి సుమారు 100 కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరాయి. వారికి వెంకట్రావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తొలుత దుమ్ముగూడెం, బుర్రవేముల గ్రామానికి చెందిన వీపు రాంబాబు, సీపీఎంలో ఎన్నో ఏళ్లుగా పనిచేసి టీఆర్‌ఎస్ పార్టీలోకి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో చేరారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కారం దారయ్య, కారం శ్రీను, వెంకట్రాముడు, వెంకటేష్, సోడి వెంకటేష్, సోడి శ్రీను, రాంబాబు, సురేష్, పాల్‌రాజు, లక్ష్మణరావు, రేసు నాగయ్య, కుంజా శ్రీను, ముత్తయ్య, ఆదినారాయణ, సోయం సీతారాముడు, సుమలత, మారయ్య, సీత య్య, జయరాజు, చిన్నయ్య, పుల్లయ్య, తెల్లం వీరయ్య, వెంకటేష్, సత్తిబాబు, భీమయ్య, పుల్లయ్య, చంద్రయ్య, కుంజా విరమయ్య, గోపయ్య, లచ్చిగూడెంలో శీలం కన్నయ్య, భాస్కర్, వెంకటేష్, రాజు, ప్రసాద్, ముత్తయ్య, బాలరాజు, కామయ్య, నాగేశ్వరరావు, చిన్న వీరయ్య ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మానే రామకృష్ణ, సీనియర్ నాయకులు ఎస్‌ఏ రసూల్, మండల అధ్యక్షుడు తోటమళ్ల సుధాకర్, జడ్పీటీసీ అన్నెం సత్యాలు, మండల కార్యదర్శి కణితి లక్ష్మణ్, కో-ఆప్షన్ సభ్యులు జానీపాషా, సీనియర్ నాయకులు కొత్తూరు సీతారామారావు, పాపరాజు, శ్రీనివాసరాజు, వీపు రాంబాబు పాల్గొన్నారు.

180
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles