సమన్వయంతోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతం


Tue,September 11, 2018 12:39 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: సమన్వయంతోనే ఎన్నికల ప్రక్రియల విజయవంతమవుతుందని ఐటీడీఏ పీవో పమేలా సత్పతి అభిప్రాయపడ్డారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశపు హాలులో బూత్‌లెవల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గ ఎన్నికలు సజావుగా సాగేందుకు సంబంధిత బూత్‌లెవల్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు తక్కువ సమయం ఉన్నందున, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటర్ లిస్ట్ తయారు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడుకీ ఓటు హక్కు కల్పించాలని, ఓటర్ లిస్ట్ మీదే ఎన్నికలు ఆధారపడి ఉంటాయన్నారు. పకడ్బందీగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని పేర్కొన్నారు. అశ్వారావుపేట ఎస్‌టీ శాసనసభ నియోజకవర్గంలో 164 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఓటర్ లిస్ట్ సంబంధించిన అంశాలను ఈనెల 15,16వ తేదీల్లో గ్రామ సభల్లో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులు ఫాం 6,7,8 ఈ మూడింటినీ ఓటు హక్కు కోసం, కావాల్సిన వారికి, కొత్త ఓటు కోసం, సవరణల నమోదు కోసం దరఖాస్తులు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా బూత్‌లెవల్ అధికారులు తమ విధులను ప్రణాళిక పద్ధతి ప్రకారం నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులకు చర్యలు తప్పవన్నారు. సమావేశంలో చండ్రుగొండ తహసీల్దార్ గుణ్యానాయక్, దమ్మపేట (భద్రకాళి) ఎలక్షన్ డీటీ సుమిత, అన్నపురెడ్డిపల్లి నాగభవాని, ములకలపల్లి నరేష్, డిప్యూటీ తహసీల్దార్ విల్సన్, బూత్‌లెవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వివిధ పార్టీల నేతలతో సబ్‌కలెక్టర్ సమావేశం
భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలు నిర్వహణ సజావుగా సాగేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా కోరారు. సోమవారం సబ్‌కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ పార్టీల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15,16వ తేదీల్లో బూత్‌లెవల్ ఆఫీసర్లు ఓటర్ల నమోదు, కొత్త ఓటర్లు, గ్రామసభలో వివరించాలని తెలిపారు. అక్టోబర్4న క్లేయిమ్స్ అభ్యర్థన, ఫైనల్ ఎలక్ట్రోరల్ అక్టోబర్8న ప్రకటిస్తామన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు యశోద నగేష్, అధికార ప్రతినిధి తిరుతిరావు, సీపీఎం తరఫున నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు నల్లపు దుర్గాప్రసాద్, బీజేపీ నాయకుడు సుబ్బారావు, సీపీఐ(ఎం.ఎల్), న్యూడెమోక్రసీ నాయకురాలు కెచ్చల కల్పన తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఐటీడీఏ పీవో పమేలా సత్పతి అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలతో సబ్‌కలెక్టర్ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. సూచనలు, సలహాలు ఇచ్చారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...