కిన్నెరసానికి సొబగులు


Mon,September 10, 2018 01:31 AM

-పర్యాటకంగా పెరిగిన ఆదరణ
-అర్బన్ పార్క్‌తో కొత్త అందాలు
-మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు చొరవతో మారిన రూపురేఖలు
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు చొరవతో పర్యాటకం దగ్గరైంది. పర్యాటకం అంటే ఇదే.. అనేలా కిన్నెరసానికి ప్రత్యేక సొబగులు తీసుకొచ్చారు. జిల్లాలో కిన్నెరసాని అంటేనే పర్యాటకుల నిలయంగా చెప్పవచ్చు. కిన్నెరసాని రిజర్వాయర్, బోట్ షికార్, జింకల పార్కు, నెమళ్ల పార్కు, అద్దాల మేడ, డక్ పాండ్, ఫారెస్ట్ మ్యూజియంతో పాటు ఇతర రమణీయ దృశ్యాలను పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దీనికి తోడు పాల్వంచలోని పెద్దమ్మతల్లి గుడి, భజనమందిరం రామాలయానికి ఆదరణ పెరగడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్వంచకు తరలి వెళ్తున్నారు. ప్రతీ ఆదివారం సందర్శకులకు కేంద్రంగా మారిన పాల్వంచ కిన్నెరసాని, పెద్దమ్మతల్లి, భజన మందిరాలకు పర్యాటకులు పరుగులు పెడుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుగానే పర్యాటకుల కోసం కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయం వరకు సిటీ బస్సులను ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

సిటీ బస్సులు ఆర్టీసీకి ఆదాయం తెచ్చిపెట్టడంతో పాటు పర్యాటకుల ప్రయాణం సులభతరానికి ఉపయోగపడ్డాయి. కిన్నెరసాని ప్రాంతానికి ఆదరణ పెరిగింది. పర్యాటకులు ప్రతీ వారం సండేతో పాటు సెలవులు వచ్చినప్పుడల్లా పర్యాటక ప్రాంతాన్ని కిన్నెరసానిగా ఎంచుకున్నారు. దీంతో కిన్నెరసాని అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బోట్ షికార్ సందడిగా ఉండటంతో జిల్లా నలుమూలల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు జిల్లా ప్రజానీకం బోటింగ్ చేయడానికి తరలివస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ బోటింగ్ పర్యాటకులను ఆకర్షింపజేస్తోంది. జిల్లాకు వచ్చిన మంత్రులు, రాష్ర్టాధికారులు చాలా మంది బోట్‌షికారు చేసి పర్యాటక ప్రాంతాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇల్లెందు క్రాస్‌రోడ్‌లోని టూరిజం హోటల్ సైతం నిర్మాణం పూర్తి కావస్తోంది. ఇవి పూర్తయితే నియోజకవర్గం పర్యాటక ప్రాంతానికి కేంద్ర బిందువు కానుంది.

పకృతికి నిలయం అర్బన్ పార్కు..
అటవీశాఖ అర్బన్ పార్క్‌కు జిల్లా కేంద్రలోకే తెచ్చిన ఘనత మాజీ ఎమ్మెల్యే జలగం కే దక్కింది. వందల ఎకరాల విస్తీర్ణంలో వాకర్స్‌కు, పర్యాటకులకు, పకృతి ప్రేమికులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా కేవలం పకృతి ప్రేమికులకే కాకుండా ఉద్యోగాల ఎంపికలకు, రన్నింగ్ పోటీలకు కూడా ఇది ఉపయోగపడుతోంది. అటవీశాఖ మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తోంది.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...