రామాలయంలో భక్తుల సందడి


Mon,September 10, 2018 01:31 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామికి అభిషేకం, ఆరాధన, అర్చన, సేవాకాలం, విశ్వక్సేన ఆరాధన తదితర పూజలు చేశారు. భక్తులు రామయ్యను, ఆలయంలోని లక్ష్మీతాయారు, అభయాంజనేయస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు బేడా మండపంలో సీతారామచంద్రస్వామికి ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు తిలకించి పునీతులయ్యారు. దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి భాద్రపద మాసోత్సవాలు..
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం నుంచి భాద్రపద మాసోత్సవాలు ప్రారంభించనున్నారు. ఈనెల 12వ తేదీ చిత్తానక్షత్రం సందర్భంగా స్వామికి యాగశాలలో ఉదయం 8నుంచి 10గంటల వర కు సుదర్శనయాగం నిర్వహించనున్నారు. తొలుత సుదర్శన స్నపనం, సుదర్శన జపం, సుదర్శన అష్టోత్తర శతనామార్చన, సుదర్శన కవచం, 108 శ్లోకాలతో హవనం, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ, మహాదాశీర్వచనం, మహా హారతి, పురోడాశమం, నివేదన ఉంటుందని దేవస్థానం ప్రధాన అర్చకుడు జగన్నాథచార్యులు తెలిపారు.
నేడు రామాలయం హుండీ లెక్కింపు
భద్రాచలం రామాలయంలో సోమవారం హుండీ లెక్కించనున్నట్లు దేవస్థానం ఇన్‌చార్జి ఈవో పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7గంటల నుంచి ఈ లెక్కింపు ప్రారంభిస్తారని, అధికారులు, సిబ్బం ది, అర్చకులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...