కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపిద్దాం


Mon,September 10, 2018 01:30 AM

టేకులపల్లి : టీఆర్‌ఎస్ ఇల్లెందు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. స్థానిక జడ్పీటీసీ లక్కినేని సురేందర్ నివాసంలో ఆదివారం నిర్వహించిన టీఆర్‌ఎస్ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అభ్యర్థి కనకయ్య విజయం కోసం, వ్యూహ ప్రతివ్యూహాలపై చర్చించారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలు, తమ మనోభావాలను సమావేశంలో వెల్లడించారు. కోరం కనకయ్యకు టేకులపల్లి మండలంలో ప్రజాదరణ పుష్కలంగా ఉందని, ప్రతీ గ్రామంలో ప్రజలు, కనకయ్య అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తున్నారని, ఆయనను మరో సారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి జనం సిద్ధంగా ఉన్నారని కార్యకర్తలు పేర్కొన్నారు. జడ్పీటీసీ లక్కినేని సురేందర్ మాట్లాడుతూ.. కనకయ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, ఆయన విజయం ఇల్లెందు నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోరం కనకయ్య వందల కోట్ల నిధులు తెచ్చారని, నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, టేకులపల్లి మండలంలో ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందని ఆయన వివరించారు. సమావేశంలో కోరం కనకయ్యకు గతం కంటే పెద్ద మెజార్టీతో విజయం చేకూర్చాలని, అందుకు అందరు కలిసికట్టుగా పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ లక్కినేని శ్యామ్, బేతంపూడి సొసైటీ చైర్మన్ వాంకుడోతు పూన్యానాయక్, పార్టీ మండల కార్యదర్శి బానోతు రామ, నాయకులు భూక్యా సైదులు, బానోతు భద్రు, భూక్యా కిషన్, బోడా మంగీలాల్, ఇస్లావత్ దేవుసింగ్, బోడా శ్రీను, భూక్యా తావుర్యా, అజ్మీర శివ, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles

మరిన్ని వార్తలు...