రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


Mon,September 10, 2018 01:30 AM

వైరారూరల్, సెప్టెంబర్ 9: వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో వైరా-మధిర ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాటిపూడి గ్రామానికి చెందిన యువకుడు వూరుగొండ్ల శివరామకృష్ణ(20) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు కొండపల్లి సురేష్‌కు గాయాలయ్యాయి. శివరామకృష్ణ, సురేష్ ద్విచక్ర వాహనంపై రెబ్బవరం గ్రామం నుంచి తాటిపూడి వస్తుండగా వైరా నుంచి జగ్గయ్యపేట వెళుతున్న ట్యాంకర్ లారీ ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న కొండపల్లి సురేష్‌కు గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని వైరా పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...