కొత్తగూడెం అభివృద్ధికి రూ.2 వేల కోట్లు

Sun,September 9, 2018 01:03 AM

-150 కాంగ్రెస్ కుటుంబాలు టీఆర్‌ఎస్‌లో చేరిక
-ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యత
-టీఆర్‌ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి జలగం వెంకటరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ సహకారంతో గడిచిన నాలుగున్నర సంవత్సరాల పాలనలో కొత్తగూడెం అభివృద్ధికి సుమారు రూ.2 వేల కోట్ల వ్యయంతో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయని కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 150 కుటుంబాల వారు శనివారం రాత్రి జిల్లా కేంద్రం సమీపంలోని చుంచుపల్లి పంచాయతీ విద్యానగర్‌లోని లక్ష్మణ్‌నాయక్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జలగం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈసందర్భంగా టీఆర్‌ఎస్ కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి జలగం వెంకటరావు మాట్లాడుతూ.. కేటీపీఎస్ ఏడో దశ విస్తరణకు కేటాయించిన వ్యయాన్ని మినహాయిస్తే సుమారు రూ.2 వేల కోట్ల వ్యయంతో ఊహించని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించామన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం, పర్యాటక రంగ అభివృద్ధి, గిరిజన రైతులకు సోలార్ బోర్లతో వ్యవసాయం, రోడ్లు, వంతెనలు, చెక్‌డ్యాం కమ్ బ్రిడ్జీలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఐఆర్ బెటాలియన్, గురుకులాలు, వసతి గృహాల నిర్మాణం, వ్యవసాయ మార్కెట్ గోదాములు, తాగునీరు, సాగునీరు పథకాలు, పాతకొత్తగూడెంలో కేజీ టూ హైస్కూల్ నిర్మాణం, ప్రీ స్కూల్ నిర్మాణంతో పాటు విద్య, వైద్య రంగాలతోపాటు సబ్‌స్టేషన్లు నిర్మించామన్నారు. అనేక ప్రజాప్రయోజనాలకు, సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేశామన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ల చేరిక
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ధరావత్ లక్ష్మణ్‌నాయక్, దేవీలలిత దంపతులు, కాసాని శ్రీనివాస్‌రెడ్డి, మాలోత్ శంకర్, లలితదంపతులు, సూర్యనారాయణ దంపతులు, ధరావత్ మోహన్‌రావు దంపతులు, విశ్వనాధం, కోటేశ్వరరావు, మోహన్‌రావు, నాగేందర్, ప్రభాకర్, భిక్కులాల్, బి.వెంకటేశ్వర్లు, జనార్ధన్‌రావు, కిషన్, మహాంకాళి నీల, చింతాల రాంబాబు, శెట్టిబలిజ సంఘం నాయకుడు జి.సత్యనారాయణ, సీహెచ్ ఎల్లారెడ్డి, రామకోటారెడ్డి, పోల్కంపల్లి కృష్ణారావు, శ్రీధర్‌రావు, కే.కృపాకర్‌రావు, డాక్టర్ సూర్యనారాయణ, భూక్యా రాజేంద్రప్రసాద్, పంచగిరి జనార్ధన్, హాత్తీరాం, కల్యాణి, కవిత, కౌసర్‌బేగం, గౌసియా సుల్తానా, ఐలూరి రమణారెడ్డి, రణపోటు వెంకటరెడ్డి, ఎండీ షాహీద్, సత్యనారాయణరెడ్డి, మహంకాళి కృష్ణప్రసాద్, సత్యనారాయణ, రాంరెడ్డి, పోస్టు శ్రీను, రాంచందర్‌తో పాటు 150 కుటుంబాల వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌మాజీ వార్డు మెంబర్ వాడపల్లి జకరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మండె వీరహన్మంతరావు, టీఆర్‌ఎస్ నాయకులు పరుచూరి కృష్ణమోహన్, జీవీకే మనోహర్, మేరెడ్డి జనార్దన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ భద్రు నాయక్, బలగం శ్రీధర్, పేరబోయిన నర్సింహారావు, గోకా జానకీరాం, పోలిన శ్రీనివాస్, తుంపురి శివ, కొంగ సురేష్, భాగం నారాయణ, కే.కృపాకర్‌రావు, నర్రా సంపత్, భూక్యా రాంబాబు, బండి విజయభాస్కర్, కే.శ్రీనివాసాచారీ పాల్గొన్నారు.

మద్దతు ప్రకటించిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం
ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం చుంచుపల్లి మండల యూనిట్ ప్రతినిధులు జలగం వెంకటరావుకు తమ మద్దతు తెలిపారు. అధ్యక్షుడు వాసిరెడ్డి శేషగిరిరావు, కార్యదర్శి డీటీ రత్నకుమార్, గౌరవాధ్యక్షుడు అంకం పాపయ్య, కోశాధికారి కే.కమలకస్తూరి, అసోసియేట్ ప్రెసిడెంట్ కే.నగధర్‌రావు, ఉపాధ్యక్షుడు బి.జ్ఞా నాలంకార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, ప్రచార కార్యదర్శి సీహెచ్‌ఎంఎం భానుమతి, కార్యవర్గ సభ్యులు సుబ్బారావు, ఎస్‌కే సుభాన్, రాములు మద్దతును ప్రకటించారు.

184
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles