ముమ్మరంగా మిషన్ భగీరథ పనులు


Sun,September 9, 2018 12:59 AM

చండ్రుగొండ : రానున్న రెండు నెలల్లో మిషన్ భగీరథ పైప్‌లైన్ల నిర్మాణ పనుల్ని పూర్తి చేయనున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వసంతకుమారి స్పష్టం చేశారు. శనివారం తిప్పనపల్లి పంచాయతీకి వచ్చిన పైపులను ఏఈ వసంతకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండలానికి 26 ట్యాంకులు మంజూరైనాయని, వీటిలో అన్ని నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా 8 నిర్మాణం పూర్తయ్యాయని మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. బాలికుంటలో ఇంటింటికి నల్లాల నిర్మాణాలు ప్రారంభమైనాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు డీ రమారావు, సిబ్బంది పాల్గొన్నారు.పురస్కారానికి ఎంపికైన ప్రభాకరాచార్యులు
అశ్వారావుపేట టౌన్ : సినారె సాహితీ పురస్కారానికి అశ్వారావుపేటకు చెందిన సాహితీ వేత్త సిద్దాంతపు ప్రభాకరాచార్యులు ఎంపికయ్యారు. కళానిలయం, త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి 87వ జయంతిని పురస్కరించుకుని ప్రదానం చేసే సాహితీ పురస్కారాన్ని ఆదివారం హైదరాబాదులోని త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో స్వీకరించేందుకు ప్రభాకరాచార్యులకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభాకరాచార్యులను ఎంఈఓ పీ కృష్ణయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...