బైక్ ర్యాలీ విజయవంతం చేయండి


Sun,September 9, 2018 12:59 AM

చండ్రుగొండ : అశ్వారావుపేట శాసనసభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన తాటి వెంకటేశ్వర్లు విజయం నల్లేరుమీదునడక లాంటిదని, ఆయన భారీ మెజారీటితో గెలవటం ఖాయమని జడ్పీటీసీ, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం మండల ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంకిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడారు. తాటి తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి ఆదివారం మండలానికి విచ్చేయుచున్న సందర్భంగా 200 మోటర్ సైకిళ్లతో స్వాగతం పలకాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు గెలుపు కోసం మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న బైక్ ర్యాలీ విజయవంతం చేయాలని డీసీఎంఎస్ వైస్ చైర్మన్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్‌రావు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు మండలానికి విచ్చేయుచున్న సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలకాలన్నారు. అశ్వారావుపేటలో తాటికి ఎదురులేదని, ఆయన గెలుపు ఏకపక్షమే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...