కేసీఆర్ సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష


Sun,September 9, 2018 12:58 AM

మధిర, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 8 : టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ఆశయాలు, ఆలోచనలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీకి శ్రీరామరక్ష అని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మధిర పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ రద్దుతో ఎన్నికల శంఖారావం మోగిందన్నారు. విజయాల మీద చర్చ అవసరం లేదని, శాశ్వతంగా తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్‌యే ముఖ్యమంత్రి అని తెలిపారు. 70సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని అనేక పనులను నాలుగు సంవత్సరాల్లో సునాయసంగా అందరినీ మెప్పించే విధంగా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చేపట్టి దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఏకైక వ్యక్తిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ సుపరిపాలన చేసి ఉంటే ఇన్ని పనులు పెండింగ్‌లో ఉండేవి కావన్నారు.

ఇన్ని పథకాలు కాంగ్రెస్ నాయకుల మదిలో మెదిలాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో పెన్షన్ రూ.200 ఉండగా టీఆర్‌ఎస్ రూ.1000 చేసిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, రక్షణ, ఇలా రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేత జనార్ధన్‌రెడ్డి సైతం కేసీఆర్‌కు కితాబుఇచ్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. సమావేశంలో ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దేవిశెట్టి రంగారావు, అరిగె శ్రీనివాసరావు, బోనకల్లు మండల కమిటీ అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మందడపు తిరుమలరావు, మల్లాది వాసు, యన్నం కోటేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, వెలగపుడి శివరాంప్రసాద్, చావా వేణు, యర్రగుంట రమేష్, మోదుగు బాబు, కోనా ధనికుమార్, గుగులోతు కృష్ణానాయక్, ములకలపల్లి వినయ్‌కుమార్, అవ్వా విజయలక్ష్మీ, బోగ్యం ఇందిర పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...