సింగభూపాలెం చెరువులో చేప పిల్లలు విడుదల

Sun,September 9, 2018 12:57 AM

సుజాతనగర్, సెప్టెంబర్ 8: మండలంలోని సింగభూపాలెం చెరువులో శనివారం రెండు లక్షల చేఉప పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలారు.ఈసందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం మత్స్యకారుల శ్రేయస్సు కోసం వివిధ రకాలపథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. ఇందులో భాగంగా నూరుశాతం రాయితీపై చేప పిల్లలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. సమీకృత అభివృద్ధి పథకం కింద చేపలను విక్రయించేందుకు ద్విచక్రవాహనాలను 75 శాతం రాయితీతో, అదే విధంగా నాలుగు చక్రాలు, మోబైల్‌షిప్ అవుట్‌లేట్స్, ప్లేట్స్‌ను 75 శాతం రాయితీపై అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2995 మంది లబ్దిదారులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్నారన్నారు.

మత్స్యకారులు ఎవరైతే ద్విచక్రవాహన దారులు కనీసం లర్నింగ్ లైసెన్సు కలిగిన వారు, నాలుగు చక్రాల వాహనాలు వారి కూడా ఎల్‌ఎల్ లేనైట్లెతే ఎంగేజ్డ్ లైసెన్సులు కలిగిన వారికి కూడా వాహనాలను ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. 50 మంది మత్స్యకారులను హైదరాబాద్ పంపించి శిక్షణ ఇప్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మత్స్య సంఘం అధ్యక్షుడు చంద్రయ్య, సింగభూపాలెం మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు లింగం లక్ష్మయ్య, సెక్రటరీ పిట్టల సాయిలు, డైరెక్టర్లు డీటీ రాజా శ్రీనివాసరావు, పెంటయ్య, కటుకూరి ఆనంద్, బానోత్ సూర్యం, ఎట్టి శ్రీను, పాకా వెంకటేశ్వర్లు, బానోత్ మున్నా, కో ఆపరేటీవ్ చైర్మన్ మండె వీరహన్మంతరావు, మాజీ సర్పంచ్ భద్రు నాయక్, చంటి, వీరన్నలు పాల్గొన్నారు.

116
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles