మసకలు కనుమరుగు.. వెలుగుకు ముందడుగు


Sat,September 8, 2018 12:47 AM

-జిల్లాలో ఇప్పటివరకూ 70,776 మందికి వైద్య పరీక్షలు
-164 మందికి శస్త్రచికిత్సలు పూర్తి
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 7: కంటి వెలుగు శిబిరాలు ఇప్పటి వరకు 16 రోజుకు చేరాయి. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. జిల్లాలోని కంటి వెలుగు ప్రత్యేకాధికారి డాక్టర్ శిరీష కంటి వెలుగు శిబిరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతీ శిబిరంలో కళ్లద్దాలు లోటు లేకుండా ఎప్పటికప్పుడు జిల్లా కార్యాలయంలో వివిధ పరికరాలను, కళ్లద్దాలను క్యాంపులకు తరలిస్తున్నారు. ఈ శిబిరాలతో ప్రజల కంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. జిల్లాలోని ప్రాథమిక కేంద్రాలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్‌లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కంటి వెలుగు శిబిరాల్లో ఇప్పటివరకు 164 మంది కంటి ఆపరేషన్లతో కొత్త వెలుగులు చూస్తున్నారు. ఇప్పటికే 70,776 మందికి కంటి పరీక్షలు చేయించగా 164 మందికి ఇప్పటికే కంటి ఆపరేషన్లు పూర్తి చేశారు. దశల వారీగా ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయిస్తున్నారు. 16 రోజులు నుంచి జరుగుతున్న కంటి వైద్యశిభిరాలకు గ్రామాల్లో అపూర్వ స్పందన లభిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 70,776 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 18,051 మందికి కళ్లద్దాలు అందాయి. అద్దాలు అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి అద్దాలు ఇస్తున్నారు. ఇందుల్లో కంటి శుక్లాలు ఉన్నవారిని కూడా గుర్తించారు. శుక్రవారం నాడు 4,233మందకి పరీక్షలు చేయగా 816 మందికి కంటి అద్దాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 164 మందికి శస్త్రచికిత్సలు చేశారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...