పార్టీని గెలిపించి బహుమానం ఇద్దాం..!


Sat,September 8, 2018 12:47 AM

అశ్వారావుపేట,నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 7: త్వరలో జరగనున్న సార్వత్రి ఎన్నికల్లో అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమానంగా ఇవ్వాలని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థ్ది, మాజీ ఎమ్మెల్యే, ట్రైకార్ ఛైర్మన్ తాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం అశ్వారావుపేట మండలం నుంచి జడ్పీటీసీ అంకత మలికార్జునరావు, పార్టీ మండల అద్యక్ష, కార్యదర్శులు బండి పుల్లారావు, బండారు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు, టీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ కన్వీనర్ మోటూరి మోహన్, మాజీ సర్పంచ్‌లు శీమకుర్తి వెంకటేశ్వరరావు, నార్లపాటి సత్యవతితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే తాటితో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నియోజకవర్గ కన్వీనర్ లింగిశెట్టి వెంకటేశ్వరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు రేమళ్ల కేదారనాథ్, ప్రసాద్,చిన్నంశెట్టి సత్యనారాయణ, తాళం సూరితో పాటు పలువురు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...