నయనానందకరం..!

Fri,September 7, 2018 01:27 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలతో ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందుతుంది. ప్రజల ముంగిటకే కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కంటిసమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక కేంద్రాలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్‌లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పర్యవేక్షణలో ఈ వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 160 మంది కంటి ఆపరేషన్లతో కొత్త వెలుగులు చూస్తున్నారు. నేటికి 14వ రోజు పూర్తి కావస్తున్న ఈ శిభిరాలకు అంతటా మంచి స్పంధన లభిస్తుంది. కుల మతం,ధనిక పేదా తేడా లేకుండా అందరికీ ఉచితంగా పరీక్షలు చేయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. జిల్లాలో 15వ రోజు కంటి వెలుగు పథకం ద్వారా ఇప్పటికే 63,823 మందికి కంటి పరీక్షలు చేయించగా 160 మందికి ఇప్పటికే కంటి ఆపరేషన్లు పూర్తి చేశారు. ఇంకా ఆపరేషన్లు చేయాల్సి ఉండగా దశలవారీగా ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయిస్తున్నారు.

ప్రతి వార్డుకు కంటి వెలుగు శిబిరాలు
కంటి వెలుగు శిబిరాలను వార్డు వార్డుకు, గ్రామగ్రామాన ఏర్పాటు చేయడంతో ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు అనుసంధానంతో కంటి పరీక్షలు నిర్వహించడం వల్ల ఎవరు, ఎక్కడి వారైనా క్షణాల్లో కంటి పరీక్షలు చేసి వారి సమస్యకు పరిష్కారం చూపెడుతున్నారు. ఒక్కో వైద్య శిబిరంలో ఇద్దరు వైద్యులతో పాటు ముగ్గురు ఏఎన్‌ఎంలు, నలుగురు ఆశా వర్కర్లు విధులు నిర్వహించి రోగులకు సకాలంలో సేవలు అందిస్తున్నారు. 15 రోజులుగా కొనసాగుతున్న వైద్య శిబిరాలు తమ గ్రామాలకు ఎప్పుడొస్తాయని వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇంకా మరో ఐదు నెలలు కొనసాగనున్నాయి. ఇందుకు గాను వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. జిల్లాలో 23 మండలాల్లో ఆయా ప్రాంతాల వారికి దగ్గరగా వారి పనులు ఆటంకం కలుగ కుండా ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి శిబిరంలో ఒక ఆప్తాలమిస్ట్ కంటి ఆపరేషన్లు అవసరమున్న వారిని ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 63,823 మందకి కంటి పరీక్షలు
15 రోజులు నుంచి జరుగుతున్న కంటి వైధ్యశిబిరాలకు గ్రామాల్లో అపూర్వ స్పందన లభిస్తుంది. ఇప్పటివరకు జిల్లాలో 63,823 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 16,311 మందికి కళ్లద్దాలు ఇచ్చారు. అద్దాలు అవసరం ఉన్న వారిని గుర్తించి వారికి ఇస్తున్నారు. కంటి శుక్లాలు ఉన్నవారిని కూడా గుర్తించారు. గురువారం 2212 మందకి పరీక్షలు చేయగా 477 మందికి కంటి అద్దాలు ఇచ్చారు. ఇప్పటి వరకు 160 మందికి శస్త్రచికిత్సలు చేశారు. కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షల ద్వారా గుర్తించిన వారిని ఆపరేషన్లు చేసే కార్యక్రమం కొనసాగుతున్నది.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles