గ్రామాల అభివృద్ధే ధ్యేయం


Thu,January 12, 2017 12:58 AM

పినపాక/ కరకగూడెం, జనవరి 11 : గ్రామీణప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం పినపాక, కరకగూడెం మండలాల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తొలుత ఆయన కరకగూడెం మండలంలోని సమత్‌మోతె పంచాయతీ గొల్లగూడెం, చొప్పాల గ్రామాల మధ్యగల పెద్దవాగుపై రూ. 4కోట్ల 6లక్షల వ్యయంతో నిర్మించనున్న వంతెన, చెక్‌డ్యాం నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం భట్టుపల్లి గ్రామంలో డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన చేసారు. అలాగే పినపాక మండలంలోని మల్లారం పంచాయతీ వెంకటేశ్వరపురం వద్ద రూ. 45లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన సభలలో ఆయన మాట్లాడారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఇందుకు ప్రభుత్వం వేలకోట్ల రూపాయలను ఖర్చుచేసి గ్రామాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. పినపాక మండలంపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని ఈ మండలాన్ని గతంలో తాను ఎంతో అభివృద్ధి చేసానని మిగిలిపోయిన పెండింగ్ పనులన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ రెండు మండలాలను సస్యశ్యామలం చేసే పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్‌ను త్వరలోనే తీసుకువస్తానని కొద్దిరోజుల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై శుభవార్త వినిస్తామన్నారు. అలాగే వట్టివాగు ప్రాజెక్ట్ కూడా నిధులు మంజూరు చేయిస్తానని హామీఇచ్చారు.

అధికారులు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయించి అర్హులైన పేదలందరికి అందజేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసిందని, ధాన్యాన్ని ఉచితంగా నిల్వ ఉంచుకోవడానికి గిడ్డంగులను నిర్మించి ఇస్తుందన్నారు. ఈ గిడ్డంగులను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లో మంత్రి ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి తక్షణమే వీటిని పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, వైస్‌చైర్మన్ బరపటి వాసు, బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ చైరపర్సన్ సూరపాక విజయనిర్మల, వైస్‌చైర్మన్ కొమరం కాంతారావు, జట్పీటీసీ జాడి జానమ్మ, ఎంపీపీ కొమరం సమ్మక్క, వైస్ ఎంపీపీ దాట్ల వాసుబాబు, మణుగూరు జట్పీటీసీ పాల్వంచ దుర్గ, అశ్వాపురం జట్పీటీసీ తోకల లత, సమత్‌మోతె సర్పంచ్ మలకం నిర్మల, అనంతారం సర్పంచ్ మోకాళ్ల కృష్ణకుమారి, ఉపసర్పంచ్ సత్యనారాయణ, కరకగూడెం సర్పంచ్ వట్టం సమ్మక్క, భట్టుపల్లి సర్పంచ్ కోరం పూలమ్మ, ఎంపీటీసీలు కొండేరు రాము, బిజ్జా రామనాధం, నర్సమ్మ, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, భద్రాచలం ఆర్డీవో నారాయణరెడ్డి, కరకగూడెం తహసీల్దార్ అమ్జద్‌పాష, పినపాక తహసీల్దార్ బి కోటేశ్వరరావు, మణుగూరు డీఎస్పీ అశోక్‌కుమార్, సీఐ అంబటి నర్సయ్య, ఎస్సై రాజ్‌కుమార్, ఎంపీడీవో గడ్డం రమేష్, ఐకేపీ ఏపీయం జ్యోతి, పీఆర్‌డీఈ మూర్తి, ఏఈలు వెంకటేశ్వర్లు, శంకర్, ఇరిగేషన్ డీఈ కృష్ణ, ఏఈఈ సక్రూ, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి అంటేనే తుమ్మల: ఎమ్మెల్యే పాయం


అభివృద్ధి అంటేనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన బుధవారం కరకగూడెం మండలం గొల్లగూడెంలో పెద్దవాగుపై వంతెన నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ మంత్రి తుమ్మల కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని అభివృద్ధి అంటేనే తుమ్మల అని కొనియాడారు. మండలంలో 12వేల ఎకరాలకు సాగునీరందించే పులుసుబొంత ప్రాజెక్ట్‌కు మంత్రి తుమ్మల కృషితో త్వరలోనే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకువచ్చి నిధులు మంజూరు చేయిస్తానన్నారు.

ఒంటరి మహిళలకు భరోసా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దే: గడిపల్లి కవిత


ఒంటరి మహిళలకు భరోసా కల్పిస్తూ వారికి నెలనెలా రూ. 1000 ఫించన్ అందజేస్తామని ప్రకటించి ఆదుకొనబోతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. ఆమె బుధవారం కరకగూడెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంఖుస్థాపన చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల దేవుడైతే, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి ప్రదాత తుమ్మల అని అన్నారు.

పాజెక్ట్‌ల నిర్మాణాలకు సహకరిస్తాం: జేసీ


పినపాక, కరకగూడెం మండలాల్లో నిర్మించతలపెట్టిన సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అన్నిఅంశాల్లో ప్రభుత్వపరంగా సహకరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ రామ్‌కిషన్ అన్నారు. ఆయన బుధవారం కరకగూడెం, పినపాక మండలాల్లో మంత్రి తుమ్మల శంఖుస్థాపనలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. కరకగూడెం మండలంలో వందల ఎకరాలకు సాగునీరు అందించే పులుసుబొంత ప్రాజెక్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్‌కు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు.

36
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS