మంత్రులు జగదీశ్‌రెడ్డి, తుమ్మలకు ఘనస్వాగతం


Thu,January 12, 2017 12:57 AM

అశ్వాపురం రూరల్, జనవరి 11: అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో రూ.కోటి 30 లక్షలతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవానికి బుధవారం విచ్చేసిన మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి మేళతాళాలు, వేదమంత్రాలతో మంత్రులను ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ బీ.వెంకటేశ్వరరావు మంత్రి జగదీశ్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం ముగించుకొని అమెర్ధ గ్రామంలో రూ.కోటి 50 లక్షలతో నిర్మించిన మార్కెట్ యార్డు గోదాముకు, డబుల్ బెడ్‌రూం ఇండ్లకు శంకుస్థాపన చేసారు.

మంత్రులకు స్వాగతం పలికిన వారిలో స్థానిక ప్రజాప్రతినిధులు బూర్గంపాడు వ్యవసాయ కమిటీ చైర్మన్ సూరపాక విజయనిర్మల, మణుగూరు, అశ్వాపురం జడ్పీటీసీలు పాల్వంచ దుర్గ, తోకల లత, అశ్వాపురం ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, మొండికుంట, మల్లెలమడుగు సర్పంచ్‌లు కొమరం ప్రభ, బేతం మల్లీశ్వరి, ఎంపీటీసీలు అంబటికర్ర సావిత్రి, బండారి బలరాం, ఏఎంసీ డైరెక్టర్లు కారం శ్రీను, తెల్లం వీరభద్రం, వట్టం రాంబాబు, విద్యుత్‌శాఖ అధికారులు ఎస్‌ఈ రమేష్, డీఈ ప్రతాపరెడ్డి, ఏఈ వేణుగోపాల్, టీఆర్‌ఎస్ నాయకులు పొడియం నరేందర్, గజ్జెల లకా్ష్మరెడ్డి, కందుల క్రిష్ణార్జునరావు, జాలె రామకృష్ణారెడ్డి, ఆకిటి రవీందర్‌రెడ్డి, ఊసా అనిల్‌కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓరుగంటి రమేష్, ఖధీర్, సురకంటి వెంకటరమణ, మేడవరపు సుధీర్, తుక్కాని మధు, పర్వత నరేష్ ఆవుల రవి, ఏనుగు క్రిష్ణారెడ్డి, చుంచు ఏకాంబ్రం తదితరులు పాల్గొన్నారు.

ఒకేచోట కలుసుకున్న మహిళా ప్రతినిధులు, అధికారులు..


బుధవారం మండలంలో మంత్రి పర్యటనలో భాగంగా అమెర్ధ గ్రామంలోని మంత్రి డబుల్ బెడ్‌రూం పనుల శంకుస్థాపన వద్ద మండలంలోని మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఒకేచోట కలుసుకున్నారు. వీరిలో జడ్పీటీసీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, మార్కెట్ కమిటీ చైర్మన్ సూరపాక విజయనిర్మల, అశ్వాపురం, మణుగూరు జడ్పీటీసీ సభ్యురాలు తోకల లత, పాల్వంచ దుర్గ, అశ్వాపురం ఎంపీడీవో శ్రీదేవి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సక్కుబాయి, టీఆర్‌ఎస్ కార్యకర్త కొదుమూరి భారతి, నర్మద పాల్గొన్నారు.

50
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS