మణుగూరులో రూ.13.40 కోట్ల అభివృద్ధి పనులు..


Thu,January 12, 2017 12:55 AM

శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మణుగూరు, నమస్తేతెలంగాణ, జనవరి11: మణుగూరు మండలంలో రూ.13.40 కోట్ల అభివృద్ధి పనులకు బుధవారం రాష్ట్ర రోడ్డు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన నిర్వహించారు. తొలుత ఆయన మండలంలోని గుట్టమల్లారం గ్రామంలో రూ.4.20కోట్ల వ్యయంతో నిర్మించే ట్రైబుల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను వెంటనే ప్రారంభించాలని, పనులను త్వరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మణుగూరు మున్సిపాలిటీలో రూ. 9.22 కోట్ల వ్యయంతో చేపట్టే పలు రోడ్లు, సైడ్‌డ్రైన్, వాటర్‌సైప్లె పైపులైన్‌ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున రూ. 9.22 కోట్ల నిధులు ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రూ. 9.22 కోట్ల అభివృద్ధి పనులకు త్వరగా టెండర్లు పిలిచి మణుగూరు మున్సిపాలిటీని అందమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. అంతర్గత రోడ్లను అద్భుతంగా తయారుచేయాలన్నారు. సెంట్రల్ లైటింగ్‌ను మెరుగుపర్చాలని, పచ్చని పూలమొక్కలను పెంచాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లికవిత, జేసీ రాంకిషన్, ఏఎంసీ చైర్మన్ సూరపాక విజయనిర్మల, జడ్పీటీసీ పాల్వంచదుర్గ, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీవో పురుషోత్తం, జడ్పీవైస్‌చైర్మన్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

47
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS