పేదల సొంతింటి కల నెరవేరుస్తాం: తుమ్మల


Thu,January 12, 2017 12:54 AM

అశ్వాపురం, జనవరి 11: పేదల సొంతింటి కలను డబుల్ బెడ్ రూం గృహాల ద్వారా నెరవేరుస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. తమకు సొంతిల్లు లేదని రాష్ట్రంలో ఎవ్వరూ బాధపడకూడదనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తుచేశారు. అశ్వాపురంలో బుధవారం డబుల్ బెడ్ రూం గృహాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతను కచ్చితంగా పాటించాలని కాంట్రాక్టర్‌ను, అధికారులను ఆదేశించారు.

అనంతరం ఆయన అశ్వాపురం మార్కెట్ యార్డు ఆవరణలో రూ.1.5 కోట్లతో 5000 మెట్రిక్‌టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జేసీ రాంకిషన్, ఆర్డీఓ శివనారాయణరెడ్డి, బూర్గంపాడు ఏఎంసీ చైర్మన్ విజయనిర్మల, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, జడ్పీటీసీ తోకల లత, మణుగూరు జడ్పీటీసీ పాల్వంచ దుర్గ, సర్పంచ్ బానోతు శారద, ఏఎంసీ డైరెక్టర్లు తెల్లం వీరభద్రం, కారం శ్రీను, టీఆర్‌ఎస్ నాయకులు ఆకిటి రవీందర్‌రెడ్డి, జాల రామకృష్ణారెడ్డి, గజ్జల లకా్ష్మరెడ్డి, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, కందుల క్రిష్ణార్జున్, కోమటిరెడ్ది వెంకటరెడ్డి, ఎస్‌కే ఖదీర్, ఓరుగంటి రమేష్, మేడవరపు సుధీర్ పాల్గొన్నారు.

42
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS