వారసత్వ ఉద్యోగాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్


Thu,January 12, 2017 12:50 AM

కొత్తగూడెం ప్రతినిధి, నమస్తే తెలంగాణ:సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అమలుపై యాజమాన్యం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటోంది. జనవరి ఒకటో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ (పా, ఫైనాన్స్) జే.పవిత్రన్‌కుమార్.. హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి బుధవారం ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో జీఎంలు, పర్సనల్ శాఖాధిఆకరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏరియాల నుంచి వచ్చిన దరఖాస్తుల వివరాలు సేకరించారు. జనవరి 1 నుంచి 9 వరకు సింగరేణి వ్యాప్తంగా 2036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని అధికారులను డైరెక్టర్ కోరారు.

అన్ని గనులు, ఏరియా జీఎం కార్యాలయాల్లో హెల్ప్ డెస్కుల ద్వారా వారికి కలిగే సందేహాలు నివృత్తి చేయాలని సూచించారు. సరైన డిపెండెంట్ కేసులకు తప్పక ఉద్యోగం వస్తుందన్న భరోసా ఇవ్వాలని, తప్పుడు ధ్రువపత్రాలతో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పూర్తి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని, దరఖాస్తు చేసేందుకు వచ్చే వారి అపోహలు, అనుమానాలు పూర్తి స్థాయిలో నివారించాలని కోరారు. డైరెక్టర్‌తో పాటు జీఎం జే.నాగయ్య పాల్గొన్నారు.

57
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS