వసతుల కల్పన పనులు వేగవంతం చేయండి


Thu,January 12, 2017 12:50 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 11: రాష్ట్రంలోనే తొలి ఇంగ్లిష్ మీడియం పాఠశాలను కొత్తగూడెంలో చేపట్టడం ఎంతో అదృష్టమని, పాఠశాలకు చేపట్టిన వసతుల కల్పన పనులు వేగవంతం చేసి ఉపాధ్యాయులు, విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు.. ఇంజనీరింగ్ అధికారులను కోరారు. బుధవారం పాత కొత్తగూడెం స్కూల్‌ను ఆయన సందర్శించారు. 15 ఎకరాలలో రూ.6 కోట్లతో ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. పాఠశాలను అనువుగా ఉంచేందుకు ఏయే పనులు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులకు వివరించారు. బాత్‌రూమ్‌ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.

పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న అంతర్గత పనులపై చర్చించారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఏ ఒక్క పని పెండింగ్‌లో ఉండరాదన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలో 952 మంది విద్యార్థులు ఉన్నారని, అంగన్‌వాడీ కేంద్రం నుంచి, ఇతర పాఠశాలల నుంచి 300 మందికి పైగా విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు హెచ్‌ఎం నాగరాజేశ్వరరావు తెలిపారు.

హైస్కూల్‌కు గాను 382 మంది విద్యార్థులు ఉన్నారని, మరో 70 మంది దరఖాస్తు చేసుకోగా వచ్చే విద్యా సంవత్సరంలో ప్రైమరీ నుంచి 180 మంది విద్యార్థులు రానున్నట్లు పాఠశాల హెచ్‌ఎం ఉషారాణి ఎమ్మెల్యేకు వివరించారు.పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని, పాఠశాల అభివృద్ధికి తాను నిరంతరం సేవలందిస్తానన్నారు. డీఎస్పీ సురేందర్‌రావు, పీఆర్ డీఈ సుధాకర్, టీఆర్‌ఎస్ నాయకులు జీవీకే మనోహర్, అక్బర్, కొట్టి వెంకటేశ్వర్లు, సలీమ్ పాల్గొన్నారు.

37
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS