భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం


Thu,January 12, 2017 12:50 AM

-రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
అశ్వాపురం రూరల్, జనవరి 11: రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు తగిన న్యాయం చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండలంలో ఆయన పర్యటించారు. సందర్భంగా సీతారామా ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు, వివిధ పార్టీల నాయకులు మంత్రిని కలిసుకున్నారు. ఈ సందర్భంగా వారు వినతి పత్రం సమర్పించారు. 2005 లో రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయి నష్టపరిహరం పొందని రైతులకు ఇప్పుడు పరిహరం ఇవ్వాలన్నారు. అమ్మగారిపల్లిలో రెండు పంటలు పండే భూములు కోల్పోతున్నందున రైతులకు మెరుగైన ప్యాకేజీ, రైతు కూలీలకు చేతిపని వారికి భృతిని కల్పించాలని వారు కోరడంతో మంత్రి తుమ్మల స్పందించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు గాదె కేశవరెడ్డి, సూదిరెడ్డి గోపాల క్రిష్ణారెడ్డి, అనంతనేని సురేష్, యన్నా అశోక్, కంచుగట్ల వీరభద్రం, నేలపట్ల సత్యనారాయణరెడ్డి,మర్రి మల్లారెడ్డి, ఇరుగు సురేష్, కొమ్ము వెంకటి, ఇరుగు పెద వెంకటి తదితరులు పాల్గొన్నారు.

42
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS