ఘనంగా రామయ్య నిత్య కల్యాణం..


Thu,January 12, 2017 12:48 AM

భద్రాచలం టౌన్, జనవరి11: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం లో రామయ్యకు బుధవారం ఘనంగా నిత్య కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4.30గంటలకు ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం, సేవాకాలం తదితర పూజలు గావించారు. అనంతరం పవిత్ర గోదావరి నది నుంచి తీర్థపు బిందెతో నదీజలాన్ని తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను మేళతాళాలతో పల్లకీలో బేడామండపానికి తీసుకొని వచ్చి వేంచేపు చేశారు. తొలుత స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణఃవచనం జరిపారు. తదుపరి కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి తెలియజేసి, వేదమంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీతా ధారణ, అమ్మవారికి యోత్ర ధారణ గావించారు.

35
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS