దుమ్ముగూడెంలో స్వామివారి కూడారై ఉత్సవం

Thu,January 12, 2017 12:48 AM

దుమ్ముగూడెం, జనవరి11: మండల కేంద్రమైన లక్ష్మీనగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదాసాంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా కూడారై ఉత్సవం బుధవారం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకుడు ఆరుట్ల రాజగోపాలాచార్యులు స్వామివారికి 101 బిందెలతో అభిషేకం చేశారు. తదుపరి స్వామివారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని పురవీధులగుండా తిరువీధిసేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. డాక్టర్ రాజశేఖర్‌రావు, గుడ్ల తాతారావు, పిలకా నాగేందర్‌రెడ్డి, శీరపు అప్పలరెడ్డి, మహిళా భక్తులు పాల్గొన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...