సమస్యలు పరిష్కరించాలని వినతి..

Thu,January 12, 2017 12:47 AM

గుండాల, జనవరి 11: మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరకగూడెం మండలంలోని గొళ్లగూడెం గ్రామంలో బుధవారం మండల టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మారుమూల ఏజెన్సీ మండలాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లాలని కోరారు. మండలంలో ప్రధానంగా ఎస్‌బీహెచ్ బ్యాంక్, ఏటీఎం సౌకర్యం కల్పించాలని, మండల కేంద్రంలో మహిళా ఇంటర్ కళాశాల నిర్మించాలని, కిన్నెరసాని-మల్లన్నవాగులపై ఎత్తిపోతల పతకాలు చేపట్టాలని కోరారు. అలాగే ప్రాథమిక వైద్య కేంద్రాన్ని అప్‌గ్రేడ్‌చేసి 15 పడకల సివిల్ ఆస్పత్రిగా ఏర్పాటు చేసి మహిళా డాక్టర్‌ను నియమించాలని కోరారు.

కొడవటంచ, పాలగూడెం, నాగారం, దొంగతోగు మీదుగా రాఘవపురంకు లింక్ రోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే ఎస్టీ కమ్యూనిటీ హల్, మార్కెట్ గోదాం, గిడ్డంగులు నిర్మాంచాలని, గ్రామాల్లో అంతర్గత రహదారులు చేపట్టాలని, గుండాలలో పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష కేంద్రంతో పాటు మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు కాచనపల్లిలో సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. మంత్రిని కలిసిన వారిలో ఎస్‌కే ఖదీర్, వూకె బుచ్చిబాబు, మోకాళ్ళ బుచ్చయ్య, పెండెకట్ల శేఖర్, ఈసం దూలయ్య, సమ్మయ్య, సత్యనారాయణ, కల్తి నాగేష్ ఉన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...