ఘనంగా రామయ్యకు రాపత్తు సేవ

Thu,January 12, 2017 12:47 AM

భద్రాచలం అర్బన్, జనవరి1: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి ముక్కోటి ఏకాదశీ ఉత్సవాల్లో భాగంగా రాపత్తు ఉత్సవాలు మూడోరోజుకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు బుధవారం పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానం ఆవరణలో ఘనంగా రామయ్యకు రాపత్తు సేవను నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామివారికి సామూహిక సహస్రనామార్చన 1008 అరటిపండ్లు, తమలపాకులు, సింధూరంలతో పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామచంద్ర స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం గావించారు. అనంతరం ఉభయదాతలైన డాక్టర్ సుదర్శన్, జయభారతిల గోత్రనామాలు స్వామివారికి విన్నవించారు. అనంతరం స్వామివారికి అష్టోత్తరశతనామార్చన గావించి నివేదన జరిపారు. తదుపరి దేవస్థానం ఆస్థాన వేదపండితులు గుదిమళ్ల శ్రీమన్నారాయణాచార్యులచే రాపత్తు ఉత్సవ వైశిష్ట్యం గురించి ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...