విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోం: డీఈవో

Thu,January 12, 2017 12:47 AM

కొత్తగూడెం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌సీహెచ్ హయగ్రీవాచారి అన్నారు. బుధవారం బంగారుచెలక ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో లోపాలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల అటెండెన్స్ రిజిస్టర్‌పై సిబ్బంది అలసత్వం వహించినట్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణ సరిగ్గా నిర్వహించడంలేదని, విద్యార్థుల లెసన్ ప్లాన్ సరిగ్గా లేదని పరిశీలనలో తేలినట్లు డీఈవో వివరించారు. అలసత్వం వహించిన పాఠశాల సిబ్బందిపై త్వరలో శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీలో డీఈవో వెంట వెంకట్రామయ్య ఉన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...