పదిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

Thu,January 12, 2017 12:47 AM

లక్ష్మీదేవిపల్లి, జనవరి 11: పది పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో హయగ్రీవాచారీ అన్నారు. బుధవారం మండలంలోని చాతకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకోవాలని, తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి వారిని చైతన్య పర్చాలని సూచించారు. జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రతీ పాఠశాలలో నూరుశాతం ఉత్తీర్ణత కోసం కృషి చేయాలన్నారు. పాఠశాలలో వివిధ సబ్జెక్టులు బోధిస్తున్న ఉపాధ్యాయులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకట్రామయ్య, పాఠశాల హెచ్‌ఎం మాధవరావు ఉన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...