అర్హులందరూ ఓటు హక్కు పొందాలి

Thu,January 12, 2017 12:46 AM

రుద్రంపూర్: అర్హులందరూ ఓటు హక్కు పొందాలని జిల్లా ఇన్‌చార్జ్ రెవెన్యూ అధికారి ఎంవీ రవీంద్రనాథ్ అన్నారు. బుధవారం రుద్రంపూర్‌లోని ప్రభుత్వ ఐటీఐలో ఏర్పాటు చేసిన ఓటు హక్కు విలువ-ఆవశ్యకత అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 25న ఏడవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని యువతను చైతన్య పరిచేందుకు ఓటును ఒక ఆయుధంగా వినియోగించుకునేందుకు జిల్లాలో విస్తృత ప్రచార చేపడుతున్నామని చెప్పారు. జనవరి ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, స్వచ్చమైన ప్రజా పరిపాలనకు యువతీ,యువకులు ప్రాధాన్యత ఇచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కు బలమైన ఆయుధమని, ఓటుతో దేశ చరిత్రను తిరగరాయవచ్చునని తెలిపారు.

ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, కళాశాలల్లో పనిదానాలలో తీసుకుంటారని తెలిపారు. మంచి పరిపాలన అందించే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటు హక్కు మంచి అవకాశమని వివరించారు. 18 సంవత్సరాలు నిండిన వారు దరఖాస్తు ఫారం 6ను పూరించి సంబంధిత సర్టిఫికెట్లు, రెండు కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అందించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు.

18 సంవత్సరాలు నిండి విద్యార్హత లేని తల్లిదండ్రుల నుంచి 8ఏ పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవాలని, ఓటరుకార్డు పోయినచో కొత్త దరఖాస్తు చేసుకోవడానికి ఫారం 8లో పూర్తి చేసి దరఖాస్తు సమర్పించాలని, ఓటరు లిస్ట్‌లో పేరు నమోదైనైట్లెతే ఓటరు కార్డు లేకపోతే 13 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక ఐడీ కార్డు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు. తహసీల్దార్‌లు అశోక చక్రవర్తి, స్వామి, ఐటీఐ ప్రిన్సిపల్ ప్రభాకర్‌రెడ్డి, ట్రైనింగ్ ఆఫీసర్లు జూంలాల్ నాయక్, చంద్రమౌళి, హేమలత, మురళీకృష్ణ, హఫీస్‌లు పాల్గొన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...