మార్గమధ్యలో పురుటి నొప్పులు.. తల్లీబిడ్డా క్షేమం

Thu,January 12, 2017 12:46 AM

సుజాతనగర్, డిసెంబర్ 27: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సీహెచ్‌సీ సిబ్బంది కథనం ప్రకారం.. కొత్తగూడెం రాంనగర్‌లో నివాసం ఉంటున్న తేజావత్ మంగమ్మ నిండు గర్భిణి. ఖమ్మంలోని తన బంధువుల కర్మకాండలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి తిరుగు ప్రయాణంలోబుధవారం ఉదయం ఖమ్మం నుంచి కొత్తగూడేనికి బయలుదేరింది. మార్గమధ్యలో పురిటి నొప్పులు ఆధికమవ్వడంతో ఆర్టీసీ బస్సును సుజాతనగర్‌లో ఆపి పీహెచ్‌పీకి వెళ్ళవలసిందిగా సూచించారు. వారు అక్కడి నుంచి ఆటోలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. వైద్యులు పరిశీలించి కాన్పుకు సిద్ధం చేయమని సిబ్బందిని ఆదేశించగా వారు అన్నీ సిద్ధం చేశారు. అయితే డాక్టర్ కే.సువర్ణ.. ఆ గర్భిణికి ఆపరేషన్ అవసరం లేకుండానే సుఖప్రసవం చేశారు. ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

23
Tags

More News

మరిన్ని వార్తలు...