మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నం


Thu,January 12, 2017 12:45 AM

కొత్తగూడెం క్రైం: అర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం సాయంత్రం గంగాబీషన్ బస్తీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక గంగాబీషన్ బస్తీకి చెందిన వీరమనేని జ్యోతి భర్త రాము రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. జ్యోతికి కుమారుడు సంతోష్, కుమార్తె సంయుక్తలు ఉన్నారు. ఇద్దరు పిల్లల పోషణ కష్టం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జ్యోతి (35) బుధవారం తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమె ఆరుపులు విని అక్కడి చేరుకున్న కుటుంబ సభ్యులు జ్యోతి ఒంటిపై మంటలను ఆర్పి హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిచారు.

అప్పటికే జ్యోతి 99 శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మానికి తరలించాలని వైద్యులు సూచించారు. సమాచారం తెలుసుకున్న వన్‌టౌన్ ఎస్సైలు భానుప్రకాష్, తిరుపతి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

43
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS