కేఓసీలో షార్టుసర్క్యూట్‌తో షావెల్ దగ్ధం!

Thu,January 12, 2017 12:45 AM

టేకులపల్లి, జనవరి 11: కోయగూడెం ఉపరితలగనిలో శూన్యవిలువకు వచ్చిన షావెల్ యంత్రం మంగళవారం రెండో షిఫ్టు సమయంలో యంత్రంలో విద్యుత్ షార్టుసర్యూట్ కారణంతో దగ్ధమయింది. కేవోసీలో లోడర్ లేని సమయంలో బొగ్గును లోడింగ్ చేసేందుకు ఈ యంత్రాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ యంత్రం జీవితకాలం 2014లోనే ముగిసిందని, ప్రస్తుతం దాని ద్వారా కేవోసీలో ఏ పని చేయించడం లేదని కేవోసీ అధికారులు తెలుపుతున్నారు. కానీ యంత్రం దహనమయిన ప్రదేశాన్ని పరిశీలిస్తే షావెల్ ద్వారా కేవోసీలో ఇంకా పనులు చేయిస్తున్నట్లుగానే అనవాళ్లు ఉన్నాయి. యంత్రం తగలబడిన సమయంలో కేవోసీలో అంతర్గత వీధుల పక్కన ఉన్న మట్టిని తొలగిస్తున్నట్లుగా ఉంటే అధికారుల మాత్రం యంత్రం పనిలో లేదంటూ దాని విలువ శూన్యం అని తెలుపుతున్నారు. ఇదే విషయమై కేవోసీ పీఓను వివరణ కోరగా.. యంత్రంలో షార్టుసర్యూట్ కారణంగా ప్రమాదం సంభవించిందని, అయితే దాని విలువ శూన్యమని అన్నారు. షావెల్ దహనం అయినప్పటికీ కంపెనీకి ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఆయన తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...