ముక్కోటి వేడుకల్లో..ప్రొటోకాల్ రగడ!

Thu,January 12, 2017 12:45 AM

భద్రాచలం, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ముక్కోటి వేడుకల్లో ప్రొటోకాల్ రగడ ఏర్పడింది. ఈనెల 9న హైకోర్టు జడ్జీ నవీన్‌రావు ఉత్తర ద్వారదర్శనం వేడుకకు వచ్చారు. అయితే ఆ సమయంలో జడ్జీ.. సీఎం సతీమణికి కేటాయించిన సెక్టార్లలో తొలుత కూర్చున్నారు. కాగా అధికారులు సదరు జడ్జీని పక్కనే ఉన్న వీవీఐపీ గ్యాలరీలోకి పంపించినట్లు తెలిసింది. ఈ విషయంలో జడ్జీ కొంత అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా రామాలయాన్ని దర్శించుకున్న సందర్భంలో కూడా జడ్జీకి సరైన ఆలయ మర్యాదలు చేయలేదట. ఈ విషయంపై కూడా ఆయన కలత చెందినట్లు తెలిసింది. దీనిపై భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ బులికృష్ణ.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

అంతేకాకుండా ఆర్డీఓ, ఆలయ ఈఓ, డీఎస్‌పీలను లిఖితపూర్వక వివరణ కోరినట్లు కూడా సమాచారం. ఇదిలా ఉండగా ఆలయంలో జడ్జీకి ఆలయ మర్యాదల విషయంపై కొందరు ఉద్యోగులను, అర్చకులను బుధవారం ఆలయ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. దేవస్థానం ఏఈఓ శ్రావణ్‌కుమార్, డీఈ రవీందర్, సూపరింటెండెంట్ భవానీ రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ కిషోర్, ఉప ప్రధాన అర్చకుడు గోపాలకృష్ణమాచార్యులకు దేవస్థానం ఈఓ మెమో జారీ చేశారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...