ధర్నాల రోజులు పోయాయ్..దరఖాస్తులతో పనులవుతున్నాయ్


Wed,January 11, 2017 01:42 AM


సత్తుపల్లి, నమస్తే తెలంగాణ, జనవరి 10 : సీమాంధ్ర పాలకుల కాలంలో సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సి వచ్చేది. కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టగానే ధర్నాలకు కాలం చెల్లింది... దరఖాస్తులతోనే పనులయ్యే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలపరిధిలోని కిష్టాపురం గ్రామంలో రూ.1.30కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను, 30 డబుల్ బెడ్‌రూం ఇండ్లకు ఆర్‌అండ్‌బీ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యాలను అధిగమిస్తూ సీఏం కేసీఆర్ 9గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తున్నారన్నారు. భవిష్యత్‌లో దీనిని 24 గంటల పాటు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. రైతులు, రైతు సంఘం నాయకులు రెండు విడతలుగా మధ్యాహ్న సమయంలో 6గంటలు రాత్రి వేళలో 3గంటల చొప్పున అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. స్టార్టర్‌ల వినియోగాన్ని రైతులు విడనాడి అవసరానికి అనుగుణంగా మాత్రమే విద్యుత్‌ను వాడుతూ పొదుపు చేయాలన్నారు. ఉచిత విద్యుత్ కదా అని మోటర్‌లను విచ్చలవిడిగా వాడితే విద్యుత్ దుబారాతో పాటు అమూల్యమైన భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందంటూ రైతులకు సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు జోడుగుర్రాలు మాదిరిగా పరుగెడుతున్నాయన్నారు.

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో సంక్షోభంలో ఉన్న విద్యుత్ శాఖను సమర్థ్దవంతంగా నిర్వహించిన ఘనత జగదీశ్వర్‌రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 6నెలలకే 5వేల మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన ఘనుడన్నారు. థర్మల్, పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్రంలో విద్యుత్ శక్తిని స్థిరీకరించగలిగారన్నారు. జైపూర్, భూపాలపల్లిలతో పాటు త్వరలో భద్రాద్రి పవర్‌ప్లాంట్, కేటీపీఎస్ 7వ దశ విస్తరణ పనులను పూర్తి చేస్తామన్నారు. బోరు బావులపై ఆధారపడే మన రాష్ట్రంలో వ్యవసాయనికి వెనకడుగు వేసే రైతులు నిరంతర విద్యుత్‌కి తోడు మిషన్ కాకతీయతో పాటుగా ప్రాజెక్ట్‌లు నిర్మిస్తూ రైతుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో 5లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలలో వ్యవసాయ, ఉధ్యానవన పంటలు విస్తారంగా ఉన్నాయన్నారు. జాజిపూల నుంచి జీడిమామిడి, జాపత్రి వరకు ప్రతి పంట ఇక్కడ పండుతుందన్నారు. నాటు పొగాకు మొదలు సాగు చేసి దొర పొగాకు(వర్జీనియా)వరకు సాగు చేస్తూ దేశ అవసారాలకు అనుగుణంగా పామాయిల్ సాగు చేస్తున్నారని ఈ ప్రాంత రైతులను ప్రశంసించారు. విద్యుత్ సరఫరా అవసారానికు మించి జనుగుతుంది రైతులు అవసరం మేరకే వాడుకుంటూ స్టార్టర్‌లను తొలగించాలన్నారు. స్టార్టర్‌ల కారణంగా విద్యుత్ సరఫరా రాగానే ఒకేసారి లోడు పడటంతో ట్రాన్స్‌ఫార్మర్‌లు మరమ్మతులకు గురవుతాయన్నారు.

మరో నెల రోజుల్లో దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాంత వ్యవసాయంలో మహిళలు చురుకుగా ఉంటారని కాశ్మీర్ కన్నా ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని అభివర్ణించారు. సీఏం కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతం తిరిగారని ఆయనకు జిల్లాపై సమగ్రమైన అవగాహన ఉందన్నారు. ఏంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. 9 గంటల విద్యుత్‌ను 3విడతలుగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారన్నారు. పారిశ్రామిక రంగంలో గుజరాత్‌కు దీటుగా తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుందన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటుగా సరికొత్త సింగిల్ విండో పాలసీతో యువనేత కేటీఆర్ పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తూ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ కనుచూపు మేరలోనే ఉందని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పదిమంది లబ్ధిదారులకు రూ.51వేల కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ట్రాన్స్‌కో డైరెక్టర్‌లు వెంకటేశ్వరరావు, జగత్‌రెడ్డి, జేసీ విన్‌య్ క్రిష్ణారెడ్డి, జడ్పీ సీఈవో భారతి, ఆర్‌డిఓ కుముదిని సింగ్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేష్, సర్పంచ్ మారగాని గురవయ్య, ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, జడ్పీటీసీ హసవత్ లక్ష్మి, పెనుబల్లి జడ్పీటీసీ వాంకుడోతు రజిత, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చళ్లగుళ్ల నరసింహారావు, గాదె సత్యం, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్, దొడ్డా గోపాలరావు, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.

56
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS