లాభనష్టాలన్నీ రైతులే భరిస్తారు..


Wed,January 11, 2017 01:42 AM


దమ్మపేట, జనవరి10 : రైతును భాగస్వామ్యం చేస్తూ పరిశ్రమలు నడిపిస్తూ లాభనష్టాలను వారే పొందుతూ వారిదే మేనేజ్‌మెంట్‌గా పామాయిల్ ఫ్యాక్టరీ కొనసాగేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం దమ్మపేట మండలం, అప్పారావుపేటలోని నూతనంగా నిర్మాణమవుతున్న పామాయిల్ ఫ్యాక్టరీని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలసి సందర్శించారు. 60టన్నుల మెగా కెపాసిటీ ఉన్న ఈ పామాయిల్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిదన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి రైతులతోనే మేనేజ్‌మెంట్ చేయిస్తూ లాభనష్టాలన్నీ భరిస్తూ అధిక లాభాలు గడించేలా ఫ్యాక్టరీ నిర్మాణం సాగుతుందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఈ ఫాక్టరీతో రైతుల కళ్లల్లో సంతోషం చూడాలన్నారు.

కల్తీలేకుండా ఇక్కడే రిఫైనరీ ఏర్పాటు చేసి క్వాలిటీ ఉన్న విజయ బ్రాండ్ ద్వారా సరఫరా చేస్తామన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈ ఫ్యాక్టరీని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో అవసరమున్న చోట ఫ్యాక్టరీలను నిర్మించేందుకు సీఎం ఆలోచన చేశారన్నారు. రైతు కాపలా వేసి రూ.7వేల నుంచి రూ.8,500 పెరిగిందని, క్రాఫ్ వస్తే 30టన్నుల సామర్థ్ధ్యాన్ని పెంచుతామని, అశ్వారావుపేటలో ఇప్పటికే 15టన్నులు పెంచామన్నారు. వారివెంట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆలపాటి రామచందప్రసాద్, ఎంపీపీ అల్లం వెంకమ్మ, ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ.సత్యనారాయణ, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పానుగంటి సత్యం, బండి పుల్లారావు, జిల్లా పార్టీ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు తదితరులున్నారు.

38
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS