ప్రభుత్వ పనితీరే పార్టీలో చేరికకు ప్రేరణ: ఎమ్మెల్యే

Wed,January 11, 2017 01:41 AM

ఇల్లెందు, నమస్తే తెలంగాణ/ ఇల్లెందు రూరల్, జనవరి 10 : ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులే ప్రజలను టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్రేరేపిస్తున్నాయని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండలంలోని సంజయ్‌నగర్ లో 65 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వా నించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొని సంక్షేమ, అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి పకడ్భందీగా అమలు చేస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు మాత్రమే ఆసరా పథకం వర్తిస్తోందని, తాజాగా ఒంటరి మహిళలకు కూడా ఆసరా పథకం వర్తింపచేసేలా ప్రభుత్వం నిర్ణయిం చిందని గుర్తుచేశారు.

ప్రతి పల్లెలోనూ సీసీ రహదారులు వేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామ న్నారు. సంజయ్‌నగర్‌లో అంతర్గత రహదారులను తాను స్వయంగా పరిశీలించానని, ఇప్పటికే చాలా వీధుల్లో సీసీ రోడ్లు మంజూరు చేశానని చెప్పారు. సుదిమళ్ళ గ్రామపం చాయతీ సంజయ్‌నగర్, ఇందిరానగర్, ఆజాద్‌నగర్, సుభాష్‌నగర్ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఈ సమస్యను అదిగమించేందుకు అవసరమైన చర్యలు వేసవికి ముందే చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే వేసవినాటికి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛ మైన తాగునీరు అందేలా పనులు వేగవంతంగా కొనసాగు తు న్నాయని వివరించారు. ఇంతేకాకుండా పేద కుటుం బా లకు యువతుల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో అన్నం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేసేందుకు ప్రతి మం డల కేంద్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటు, మిషన్ కాకతీయ వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ లను రెండేళ్ల లో నూరుశాతం అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.

సీఎం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు మరిన్ని అమలులోకి వచ్చేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆయనకు అండగా ఉంటూ టీఆర్‌ఎ స్ ను ఆదరిం చా లని కోరారు. టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మడత వెం కట్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇల్లెందు ఏజెన్సీ గ్రామాల్లో సమ స్యలపై సంపూర్ణ అవగాహన ఉందని, క్ర మం తప్పకుం డా అందుబాటులో ఉన్న నిధులతో సమ గ్రంగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే అహర్నిషలు కృషి చేస్తున్నారని వివ రించారు. అనంతరం సంజయ్‌నగర్ ప్రాంతంలో పర్య టించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ భూక్య నాగేశ్వరరావు, వైస్ ఛైర్మన్ తాటి బిక్షం, ఎంపీటీసీలు మండల రాము మహేష్, లక్ష్మి, టీఆర్‌ఎస్ నాయకులు కనగాల పేరయ్య, సిలివేరు సత్యనారాయణ, గణేష్, సాంబమూర్తి, తులసీ రాంగౌడ్, డేరంగుల పోషం, కరీం, జైత్రాం, శివరాత్రి ఎల్ల య్య, ధనుంజయ్, పీకె శ్రీనివాస్, రావుల ఐలయ్య, సిద్ద య్య, నవీన్, హరినాధ్‌బాబు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...