12 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


Wed,January 11, 2017 01:41 AM

ఇల్లెందు, నమస్తే తెలంగాణ, జనవరి 10 : సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. మంగళవారం స్ధానిక క్యాంపు కార్యాలయంలో 12 మంది బాధితులకు చెక్కులను అం దజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనా రోగ్యం సంభవిస్తే సీఎం రిలిఫ్ ఫండ్‌ను ఆశ్రయించాలని సూచించారు. నియోజకవర్గంలో అనేక మందికి సీఎం రిలిఫ్ ఫండ్‌ను అందించామని తెలిపారు. టేకులపల్లి మం డలం చింతోనిచెలకకు చెందిన ఊకే కౌసల్యకు రూ. 75 వేలు, మూడ్‌తండాకు చెందిన మూడ్ రమేష్‌కు రూ. 40వేలు, కామేపల్లి మండలం పెంజరమడుగుకు చెందిన గుజ్జర్లపూడి సతీష్‌కు రూ. 75వేలు, బయ్యారం మండలం టోక్యా తండాకు చెందిన రోజాకు రూ. 20 వేలు తదితరు లకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయ కులు సిలివేరి సత్యనారాయణ, మూల మధుకర్‌రెడ్డి, అక్కి రా జు గణేష్, వడ్లమూడి దుర్గప్రసాద్, భూక్య నాగేశ్వర రావు, ధనుంజయ్, హరినాధ్‌బాబు పాల్గొన్నారు.

39
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS