టోల్‌గేట్.. ఇక నో లేట్..!


Sun,December 15, 2019 01:49 AM

- నేటి నుంచి అమల్లోకి ‘ఫాస్టాగ్’
-ట్యాగ్ ఉంటే చాలు.. టోల్‌ప్లాజా వద్ద ఆగాల్సిన పనిలేదు
- జిల్లాలో రెండు టోల్‌ప్లాజాల వద్ద అమలు
నేరడిగొండ : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫాస్టాగ్ విధానం అన్ని టోల్‌గేట్‌ల వద్ద నేటి నుంచి అమల్లోకి రానుంది. కానీ ప్రభుత్వం సూచించిన విధంగా ఫాస్ట్‌టాగ్‌ను వాహనదారులు సమకూర్చుకోక పోవడం సాధ్యం కాకపోవడంతో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు గడువు పెంచింది. ఈ మేరకు దేశంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఆదివారం నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రకటిస్తూ వస్తున్న ఫాస్టాగ్ డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ వాహనదారులు అనుకున్నంత తీసుకోక పోగా అది అమలులోకి రాకుండా 15 రోజులు ప్రభుత్వం వాయిదా వేసింది.
నిమిషం కన్నా తక్కువ వ్యవధిలో పనిపూర్తి
ఫాస్టాగ్ విధానం అమలులోకి రావడం ద్వారా వాహనదారులు టోల్‌ప్లాజాల వద్ద ఒక నిమిషం కన్నా తక్కువ సమయం వ్యవధిలో పనిపూర్తి చేసుకుని వాహనం వెళ్లిపోయేందకు వీలు కల్పించింది. అందుకే దీనిని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా చెప్పింది. ఈ విధానాన్ని పక్షం రోజులుగా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అయితే ఇందులో మ్యానువల్ పద్ధ్ధతి కూడా కొంతకాలం కొనసాగుతుంది.


జాప్యమవుతుండడంతోనే ‘ఫాస్టాగ్’
పండుగలు, పార్టీల సమావేశాలు ఇతర ముఖ్య సమయాల్లో టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానానికి రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి వాహనాలకు నిర్ధారిత రుసుము చెల్లిస్తే ఫాస్టాగ్ పేరుతో స్టిక్కర్ రూపంలో ఉండే ప్రత్యేక ట్యాగ్‌ను ఇస్తారు. దాన్ని వాహనం ముందు అద్దానికి అతికించుకోవాలి. టోల్‌గేట్ వద్దకు రాగానే, అక్కడి సెన్సార్లు ఆటోమేటిగ్‌గా ఆ ట్యాగ్ నుంచి నిర్ధారిత రుసుము మినహాయించుకుంటాయి. దీంతో ఆటోమేటిక్‌గా గేట్ తెరుచుకుంటుంది. ఈ వ్యవస్థను దేశ వ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ సిద్ధంగా ఉన్నందున ముందు అనుకున్న సమయానికి అమలు చేయలేక పోయిన మరింత గడువు పొడిగింపుతో ఈ నెల 16 నుంచి అమలులోకి రానుందని అధికారులు ప్రకటించారు.

10 బూత్‌లలో ఫాస్టాగ్
జిల్లాలోని జాతీయ రహదారి పరిధిలో రోల్‌మామడ, జైనథ్ మండలంలోని పిప్పర్‌వాడ టోల్‌ప్లాజాలు ఉన్నాయి. నేరడిగొండ మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజా వద్ద 12 బూత్‌లు ఉన్నాయి. అందులో వన్‌సైడ్‌లో ఉండేవి ఆరు. కాగా ఒకటి మాత్రమే మ్యానువల్‌గా డబ్బులు చెల్లించి వాహనాలను వదులనున్నామని టోల్‌ప్లాజా ఇన్‌చార్జి మేనేజర్ కృష్ణం రాజు తెలిపారు. మిగితా ఐదు బూత్‌ల నుంచి ఫాస్టాగ్ వాహనాలను పంపనున్నారు. ఫాస్ట్‌టాగ్ తీసుకున్న వాహనాలు నిమిషం కన్నా తక్కువ గడువులో వెళ్లిపోతాయి. దీంతో సమయం వృథా కాకుండా ఫాస్ట్‌గా వెళ్లడంతో వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మిగితా ఎవరైతే ఫాస్టాగ్‌ను తీసుకోని వారు ఉంటే యథావిధిగా డబ్బులు చెల్లించేలా ఒక బూత్‌ను ఏర్పాటు చేశారు. కాని ఒకవేళ ఫాస్టాగ్ తీసుకోని వాహనాలు ఫాస్టాగ్ బూత్ నుంచి వెళ్లాలనుకుంటే చెల్లించే ఫీజుకు డబుల్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం అమలు చేస్తున్న ఫాస్టాగ్ విధానం ద్వారా టోల్‌ప్లాజాల వద్ద ఇక నుంచి వాహనదారులకు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని చెప్పవచ్చు.

90
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles