రాజీమార్గమే మేలు


Sun,December 15, 2019 01:48 AM

-క్షణికావేశంతో తప్పులు చేసి జైలుపాలు కావద్దు
-ఆదిలాబాద్ ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని
-జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : క్షణికావేశంలో తప్పులు చేసి జైలు పాలు కావద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లాకేంవూదంలోని న్యాయ సేవా అధికార సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్షికమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి పలు కేసులను కొట్టివేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన లేక పోవడం క్షణికావేశంలో తప్పులు చేసి జైలు పాలవుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసమే జాతీయ లోక్‌అదాలత్ కార్యక్షికమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌కు ముందు బ్యాంకర్లు, విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇన్సూన్స్ అధికారులతో సమావేశాలను నిర్వహించి సూచించడం జరిగిందన్నారు. అందరి సమష్టితో కక్షిదారుల మధ్య రాజీ కుదుర్చడంతో లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. ఇద్దరు రాజీపడగా.. కేసులను కొట్టివేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతంలో చట్టాలపై జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్షికమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్షికమంలో జిల్లా అధనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి ప్రసాద్, పీపీలు ముస్కు రమణాడ్డి, సంజయ్ వైరాగరే, కోర్టు అధికారులు, పలువురు న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles