కేసుల సత్వర పరిష్కారానికే ‘లోక్ అదాలత్’


Sun,December 15, 2019 01:48 AM

బోథ్, నమస్తే తెలంగాణ : దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నట్లు బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి పీబీ కిరణ్‌కుమార్ అన్నారు. శనివారం బోథ్‌లోని కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ... క్షణికావేశంలో చేసిన తప్పులకు కేసుల్లో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరిగే వారికి సదావకాశమన్నారు. లోక్ అదాలత్‌లో వచ్చిన కేసులను పరిశీలించి ఇరు వర్గాల వారి అంగీకారంతో కేసు కొట్టి వేయవచ్చన్నారు. బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్, పోలీసు స్టేషన్‌ల పరిధిలోని కేసులను పరిష్కరించారు. కార్యక్షికమంలో ఏజీపీ కత్తూరి సుభాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్‌రావు దేశ్‌పాండే, న్యాయవాదులు రూపేందర్‌సింగ్, మంచికుంట హరీశ్, అంగద్‌కేంద్రె, పంద్రం శంకర్, సీఐలు, ఎసై్సలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
మొండి బకాయిలకు పరిష్కారం
బోథ్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్వయం సహాయక సంఘాలకు చెందిన మొండి బకాయిలకు పరిష్కారం లభించింది. శనివారం బోథ్ కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 39 సంఘాలకు చెందిన మొండి బకాయిలను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద పరిష్కరించారు. 55 సంఘాల వారు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో వారిపై బ్యాంకు అధికారులు కేసులు నమోదు చేశారు. దీంతో 39 సంఘాల వారు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద చెల్లించడానికి ఒప్పుకున్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles