మెరుగైన వైద్యం అందించాలి


Sun,December 15, 2019 01:47 AM

ఉట్నూర్ రూరల్ : ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో మనోహర్ అన్నారు. శనివారం ఉట్నూర్ మండలం సేవదాస్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో కీటక జనిత వ్యాధులు, అంటువ్యాధులు, గర్భిణులు, ప్రసవాలు, టీకాలపై సదస్సులను ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణుల నమోదు ప్రక్రియ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తప్పనిసరి హైరిస్క్ కేసులను గుర్తించి వివరాలు సేకరించాలని రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. టీబీ, క్షయ, పైలేరియా, మలేరియా, డెంగ్యూ రోగస్తులను గుర్తించి వివరాలు సేకరించాలన్నారు. సమయ పాలన పాటిస్తూ వైద్యసేవలు అందించాలన్నారు. రికార్డులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. విధులపై నిర్లక్షం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్షికమంలో ఏఎంవో వెంక సీహెచ్‌వో రుకుందాబాయి, హెచ్‌ఈ సత్యనారాయణ, సూపర్‌వైజర్ గణేశ్ కుమారి, సబ్ యూనిట్ అధికారి గోకుల్, ఏఎన్‌ఎం శ్యామలతోపాటు ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles