సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ


Fri,December 13, 2019 10:58 PM

జైనథ్‌ : సీసీ కెమెరాలతోనే నేరాలను నియంత్రించవచ్చని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం మండలంలోని నిరాల గ్రామంలోని మీసేవలో ఆరు సీసీకెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే దొంగతనాలు, ఇతర నేరాలు జరిగినప్పుడు సీసీ ఫుటేజీతో నిందితులను పట్టుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో కొత్త వ్యక్తులు, అపరిచితులు కనిపిస్తే వారి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై సాయివెంకన్న, సర్పంచ్‌ ప్రభాకర్‌, మీసేవ నిర్వహకుడు జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles