పెండింగ్‌ సమస్యలను పరిష్కరించండి


Fri,December 13, 2019 10:58 PM

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాను ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న కలిశారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. కొన్ని గ్రామాలకు అండర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు. మరిన్ని రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ కొత్తలైన్‌ పనులు త్వరితగతిన ప్రారంభించాలన్నారు. జీఎంను కలిసిన వారిలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరే రాజన్న, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మెట్టు ప్రహ్లాద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సాజిదొద్దీన్‌, బండారి సతీశ్‌, యునీస్‌ అక్బాని, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


జీఎంకు వినతుల వెల్లువ..
జిల్లాలో పలు సమస్యలపై జీఎంకు వినతులు వెల్లువెత్తాయి. మహాలక్ష్మీవాడ, గాంధీనగర్‌, రణదీవ్య నగర్‌, తాటిగూడ, భాగ్యనగర్‌ కాలనీల తోపాటు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చి ఫిర్యాదులు చేశారు. రైల్వే ఉద్యోగులు సైతం సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జీఎంకు ఫిర్యాదు చేశారు. ప్రతి ఫిర్యాదుపై స్పందించి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles