‘ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌' పనులపై చర్చిస్తున్నాం


Fri,December 13, 2019 10:58 PM

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ - ఆర్మూర్‌ రైల్వే లైన్‌ పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా అన్నారు. శుక్రవారం ఆయన జి ల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ ఆవరణలో మినీ పార్కును ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. జిల్లాలో రైళ్ల డిమాండ్‌ చాలా ఉందన్నారు. ప్రజల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నా రు. ైప్లెఓవర్‌ బ్రిడ్జీలు, ఆర్‌వోబీ, ఆర్‌యుబీ, కొత్త రైళ్లు, పొడగింపు డిమాండ్‌ ఉందన్నారు. పిప్పల్‌ ఖోటి ముథ్కేడ్‌ వరకు ఎలక్ట్రిఫికేషన్‌ పనులకు టెండర్లు పూర్తి చేశామన్నారు. వచ్చే ఏడాది డబ్లింగ్‌ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. డివిజన్‌ పరిధిలో 24 మ్యానువల్‌ రైల్వే గేట్లను త్వరలో ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. రైలు ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే శాఖ సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఆదిలాబాద్‌ రైల్వే స్టేషన్‌ను సుం దరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. తాగునీరు, స్టేషన్‌ ఆవరణలో ఆహ్లాదం పంచడానికి గడ్డి, పూల మొక్కలు పెం చాలన్నారు. స్టేషన్లను ఎప్పటికప్పడు శుభ్రపర్చాలన్నారు. అవసరం మేరకు పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని సూచించారు. వాహనాలు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట నాందేడ్‌ డీఆర్‌ఎం సింగ్‌, నాందేడ్‌ డీఎన్‌ సజ్జా, ఆదిలాబాద్‌ స్టేషన్‌ మేనేజర్‌ పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles