ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి


Fri,December 13, 2019 10:58 PM

ఉట్నూర్‌ రూరల్‌ : దళితులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ అన్నారు. మండలంలోని నర్సాపూర్‌(బి) గ్రామపంచాయతీ పరిధిలోని గొట్టిపటార్‌ గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో ఎస్సీలు ప్రభుత్వం అందించే పథకాలకు నోచుకోవడం లేదని పలువురు దళిత నాయకులు ఈడీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో విద్య, ఉద్యోగ, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని అన్నారు. గ్రామంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి తాము సాగు చేస్తున్న పంట భూములపై హక్కు కల్పించాలని కోరారు. అనంతరం ఈడీ మాట్లాడుతూ ఎస్సీలకు ప్రభు త్వం ద్వారా భూమి కొనుగోలు పథకం, వ్యవసాయ పనిముట్లు, కూరగాయలు పందిరి, భూమి అభివృద్ధి వంటివి రాయితీపై అందిస్తోందన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కళావతి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles