పల్లెపల్లెనా డంపింగ్‌యార్డులు


Fri,December 13, 2019 12:08 AM

-మెరుగుపడనున్నపారిశుద్ధ్యం
-ఉపాధి హామీ నిధులతోనిర్మాణం
-సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు


ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : పల్లె ప్ర ణాళిక కార్యక్రమంలో భాగంగా చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలుండగా 68 పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులున్నాయి. మిగతా గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల స్థలాలను గుర్తించారు.

మెరుగుపడనున్న పారిశుద్ధ్యం
జిల్లాలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగా ప్రతి గ్రామపంచాయతీలో తప్పని సరిగా డంపింగ్‌యార్డు ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులు ప్రణాళికలు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన పనులను ఇప్పటికే ముమ్మరం చేశారు. అలాగే వాటికి సంబంధించిన పనులు జిల్లాలో పూర్తి కావస్తున్నాయి. ఇంతకు ముందులా ఎక్కడపడితే అక్కడ చెత్తవేయకూడదన్న నిబంధనల నేపథ్యంలో ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో చెత్తను ఎక్కడపడితే అక్కడ వేసేవారు. దీంతో మురుగుకాలువల్లో, రోడ్లపైనా ఎక్కడ పడితే అక్కడ చెత్త, ప్లాస్టిక్‌ కవర్లు దర్శనమిచ్చేవి. కానీ వీటి నిర్మాణంతో పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగు పడనున్నది.

అన్ని జీపీల్లో ఏర్పాటు
జిల్లాలో 468 గ్రామపంచాయతీలుండగా 68 పంచాయతీల్లో ఇప్పటికే డంపింగ్‌ యార్డులున్నాయి. మిగతా జీపీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం చేపడుతున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా వీటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు. జీపీ ఫండ్‌ ద్వారా 145 డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయగా ఉపాధిహామీ నిధుల ద్వారా 38 ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో డంపింగ్‌ యార్డుకు ఉపాధిహామీ నిధులు రూ.1.60 లక్షలు కేటాయించారు. జీపీ నుంచి అవసరమైనన్ని నిధులు వినియోగించుకోవచ్చు.

సేంద్రియ ఎరువుల తయారీ
ప్రతి గ్రామపంచాయతీలో తడి, పొడి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా తప్పకుండా తడి, పొడి చెత్తను వేరుచేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది. డంపింగ్‌ యార్డుల పక్కనే వర్మికంపోస్ట్‌ తొట్టెలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తికాగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఇప్పటికే అధికారులు తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికీ రెండు చెత్తబుట్టలను అందజేశారు. చెత్త సేకరణకు వచ్చే రిక్షా, ట్రాక్టర్‌లో తడి పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు. ఈ ప్రక్రియతో పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపడనున్నది.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles