ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌


Fri,December 13, 2019 12:07 AM

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లాకేంద్రంలో జరిగిన ఎంపీపీల సమావేశంలో ఫోరం జిల్లా శాఖ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉట్నూర్‌ ఎంపీపీ పంద్ర జయవంత్‌రావు, ఆదిలాబాద్‌ ఎంపీపీ సెవ్వ లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా గుడిహత్నూర్‌ ఎంపీపీ రాథోడ్‌ పుండలిక్‌, కార్యదర్శిగా జైనథ్‌ ఎంపీపీ మాశెట్టి గోవర్ధన్‌, కోశాధికారిగా తలమడుగు ఎంపీపీ కల్యాణం లక్ష్మిని ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన ఫోరం సభ్యులు జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌, ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు, మాజీ ఎంపీ నగేశ్‌ను కలువగా వారు శుభాకాంక్షలు తెలిపారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles