పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి


Fri,December 13, 2019 12:06 AM

బజార్‌హత్నూర్‌: పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా విద్యాధికారి రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం బజార్‌హత్నూర్‌ మండలం దేగామ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి చదవలని అప్పుడే చదివే విషయం గుర్తుంటుందన్నారు. సబ్జెక్టుల వారీగా సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూర్బా, ప్రాథమిక పాఠశాలను సందర్శంచి తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. రోజువారీగా ఎలాంటి భోజనం అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. ప్రాథమిక పాఠశాలలో గోడలపై మహానుభావుల చిత్రపటాలను, ఆంగ్ల వర్ణమాల, జంతువులు, పక్షుల బొమ్మలను చూసి ఉపాధ్యాయులను ఆభినందించారు. 190 మంది విద్యార్థులకు తరగతి గదులు సరిపోవడం లేదని, ఆట స్థలం కేటాయించాలని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పోషకులు విద్యాధికారికి తెలుపగా తర్వలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. డీఈవో వెంట ఎంఈవో శ్రీకాంత్‌, ప్రధానోపాధ్యాయులు ప్రేమ్‌సింగ్‌, ఎస్‌వో నాంపెల్లి సువర్ణ, ఉపాధ్యాయులు దశరథ్‌, లక్కం శంకర్‌, రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles