విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు


Fri,December 13, 2019 12:06 AM

నార్నూర్‌ : పనితీరుపై అసంతృప్తి చెంది సెకండ్‌ ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌లకు డిప్యూటీ డీఎంహెచ్‌వో మనోహర్‌ మెమోలు జారీ చేశారు. వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. గురువారం నార్నూర్‌ పీహెచ్‌సీ పరిధిలోని కొత్తపల్లి (హెచ్‌) సబ్‌ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలిస్తూ, వైద్యం అందించే తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని, వైద్యం కోసం వచ్చేవారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. గర్భిణులకు ప్రతి నెలా వైద్య ప రీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. మతాశిశు మరణాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గర్భిణులు దవాఖానలోనే ప్రసవం పొందేలా చూడాలని సూచించారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles