లచ్చంపూర్‌లో పుస్తకాల ఆవిష్కరణ


Thu,December 12, 2019 01:00 AM

తలమడుగు : ప్రముఖ తత్వకవి యోగి పరమేశ్వరయ్య రచించిన ‘ఆత్మసాక్షాత్కారం’, ‘మానవద్గీత’ పుస్తకావిష్కరణను బుధవారం తలమడుగు మండలంలోని లచ్చంపూర్‌ గ్రామంలో గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామిజీ, టీడీడీసీ చైర్మన్‌ లోక భూమారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీఎస్‌డీడీసీ చైర్మన్‌ మాట్లాడూతూ.. ప్రముఖ కవి యోగి పరమేశ్వరయ్య రచనలు ఆధ్యాత్మికంగా ఉంటాయన్నారు. పరమేశ్వరయ్య మనుమడు శివుడయ్య ఆ రచనలకు బాధ్యతలు తీసుకొని నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులు వారి కవితలను వినిపించారు. వివిధ గ్రామాల నుంచి వారి శిష్యులు తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ముల్కల గంగమ్మ, రాజేశ్వర్‌, నిర్వాహకులు శివుడయ్య, కవులు కబీర్‌దాసు, గంగుల అరవింద్‌, సల్లా విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles