వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించాలి


Thu,December 12, 2019 01:00 AM

-జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శ్రీకాంత్‌
బోథ్‌, నమస్తే తెలంగాణ : వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ మిట్టపల్లి శ్రీకాంత్‌ సూచించారు. బుధవారం మండలంలోని సొనాల పీహెచ్‌సీని సందర్శించారు. సొనాల, కౌఠ (బీ)ల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను తనిఖీ చేశారు. వ్యాధి నిరోధక టీకాల రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐవో మాట్లాడుతూ... పిల్లలకు ఇచ్చే టీకాల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామాల వారీగా ఉన్న సెషన్స్‌ ప్రకారం టీకాలు వేయాలన్నారు. పీహెచ్‌సీ నుంచి తీసుకునే వ్యాక్సిన్‌ నిర్ణీత సమయంలోగా అప్పగించాలన్నారు. సొనాల పీహెచ్‌సీలో కోల్డ్‌ చైన్‌ సిస్టమ్‌ను పరిశీలించారు. డీఐవో వెంట వీసీసీఎం సాయి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటలక్ష్మి, ఫార్మాసిస్టు మనోహర్‌, ఏఎన్‌ఎంలు పరిపూర్ణ, చంద్రకళ, హెచ్‌ఏ ఎస్‌.లింగారెడ్డి ఉన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles